August 15, 2012

సమరయోధులందరికి పాదాభివందనాలు...

proud to be an INDIAN
జాతి స్వేచ్చ కోసం 
సుమారు ముడువందలల్యేల్ల బానిసత్వం నుంచిస్వాతంత్ర్యపు నగవుల్ని మనకందించిన
సమరయోధులందరికి వందనాలు పాదాభివందనాలు.... 

తమ తమ ప్రాణాల్ని బలిచ్చి మనకందించిన 
స్వేచ్ఛాస్వాతంత్ర్యపు నగవుల్ని-
కాపాడుకుందాం - తరతరాలకు అందిద్దాం 

భారతీయులందరికీ 
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.....

August 12, 2012

మోసానికి వారసులు కాకండి...!


పరిచయం 
పరిధిదాటి 
వ్యామోహం వ్యవహరించగా..
ఈ ప్రేమ. . . .

3నిమిసాల  ముచ్చట కై  

ముద్దు ముద్దు మాటలాడి 
''  మోసానికి  ''  
ముద్దుల వారసులు కాకండి...! 

August 5, 2012

బావాన్ని పట్టుకోలేనిది నా స్నేహం....!

స్నేహం ఓ బాద్యత 
విశాలమైన నా హృదయాకాశంలో 

కలల్లోకి తొంగిచూసి
ఎం చూస్తావ్ మిత్రమా..

మనసులో ప్రవేశించి
ఎం  దర్శిస్తావ్ నేస్తం.. 

బావాన్ని పట్టుకోలేనిది నా స్నేహం....! 

August 4, 2012

ఓ నిజమైన ప్రేమికుడా...!

ప్రేమలో రాజీ పడకు 
ప్రేమ పుష్పం  మాటున 
సంఘం ముళ్ళు  ఉంటుంది..

ప్రేయసి  పస్పం  కాటుక న
పకృతి పరిమళం ఉంటుంది....!


ఓ నిజమైన ప్రేమికుడా
ముళ్ళు  కతేందో -  పరిమళం గాదేందో..
తెలుసుకో, గేలుసుకో.    

July 19, 2012

నీవు పెట్టిన అన్నం...

నీవు పెట్టిన  
అన్నం 
మూడు గంటల్లో జీర్ణమైపోతుంది...!


నీవు  చేసిన 
మేలుమాత్రం
మూడు తరాల వరకు నిలుస్తుంది....!  

June 6, 2012

హైటెక్ సోదరులారా..?


మనుషులని ప్రేమించండి..
వాడుకోకండి.!
- -
వస్తువుల్ని వాడుకొండి....
ప్రేమించకండి..! 

May 15, 2012

నీవు - నీవారు

నీవు 
నమ్మిన వారు 
నీవారు కాదు..

నిన్ను 
నమ్మిన వారు 
అందరు నీవారు..!  

March 16, 2012

ఒక అబ్బాయి ఒక అమ్మాయి

ఒక అబ్బాయి ఒక  అమ్మాయిని ప్రేమించడం మెదలేట్టగానే
తనకి తెలీకుండానే అన్ని పోగొట్టుకుంటూ / ఓడిపోతాడు.... 
కానీ అదే గెలుపు అనుకుంటాడు....

ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించడం మెదలేట్టగానే
తను అన్ని గెలుస్తుంటది...
కానీ తనకి తెలీకుండానే ఓడిపోతానేమో అని బయపడుతుంటది.   

January 27, 2012

అమ్మ జీవన ప్రదాత.!

అమ్మ 
జీవన ప్రదాత.. 

భాష 
జాతి నిర్మాత..! 

ప్రపంచ మొక వ్యామోహం..?

ప్రపంచ 
మొక వ్యామోహం ..

కవిత్వ  
మొక తీరనిదాహం  ..!

January 21, 2012

కవిత్వం నిదురపోదు.!

చేతులు 
అలిసిపోతాయి 
రాత అలసిపోదు..

కవులు 
నిదురపోతారు
కవిత్వం నిదురపోదు...!
 

January 20, 2012

వంటగది ఉన్నట్లే.. పుస్తకాల గదొకటి ఉండాలి..!

ప్రతి ఇంట్లోనూ 
వంటగది ఉన్నట్లే 
పుస్తకాల గదొకటి ఉండాలి.!

ప్రపంచీకరణలోమనిషికి
కడుపుమేత ఒకటే చాలదు..
మెదడుకు మేత కావాలి...!

January 17, 2012

విత్తు శోదించమంటుంది - పక్షి లేక్కెయమంటుంది..!

మట్టిలో 
మొలకెత్తే విత్తు 
భాధను
శోదించమంటుంది..

కొమ్మలో 
గూడు కట్టిన పక్షి 
విశ్వాసాన్ని లేక్కెయమంటుంది..!

January 14, 2012

దైవ ప్రతినిధులే మన పండుగలు..!?

God is one
భక్తి
జ్ఞానాలే 

తరిగిపోని భాగ్యాలు, 


దైవ

ప్రతినిధులే

మన పండుగలు..! 

January 12, 2012

చట్టాల్ని తప్పించడం! చుట్టాల్ని మెప్పించడం.!

మా దేశంలో 

అధికారమంటే 
ఏమిటో  తెలుసా ..?

ఆ-కారుల్ని ఒప్పించడం!

చట్టాల్నితప్పించడం .!
చుట్టాల్ని మెప్పించడం..!

January 11, 2012

చీకట్లో అసలు దొరకదు.!

ఆత్మలో 
లేని ఆనందం 
జన్మలో 
వెతికినా దొరకదు..

వెలుగులో 
లేని సౌందర్యం 
చీకట్లో  
అసలు దొరకదు...!