January 27, 2012

అమ్మ జీవన ప్రదాత.!

అమ్మ 
జీవన ప్రదాత.. 

భాష 
జాతి నిర్మాత..! 

ప్రపంచ మొక వ్యామోహం..?

ప్రపంచ 
మొక వ్యామోహం ..

కవిత్వ  
మొక తీరనిదాహం  ..!

January 21, 2012

కవిత్వం నిదురపోదు.!

చేతులు 
అలిసిపోతాయి 
రాత అలసిపోదు..

కవులు 
నిదురపోతారు
కవిత్వం నిదురపోదు...!
 

January 20, 2012

వంటగది ఉన్నట్లే.. పుస్తకాల గదొకటి ఉండాలి..!

ప్రతి ఇంట్లోనూ 
వంటగది ఉన్నట్లే 
పుస్తకాల గదొకటి ఉండాలి.!

ప్రపంచీకరణలోమనిషికి
కడుపుమేత ఒకటే చాలదు..
మెదడుకు మేత కావాలి...!

January 17, 2012

విత్తు శోదించమంటుంది - పక్షి లేక్కెయమంటుంది..!

మట్టిలో 
మొలకెత్తే విత్తు 
భాధను
శోదించమంటుంది..

కొమ్మలో 
గూడు కట్టిన పక్షి 
విశ్వాసాన్ని లేక్కెయమంటుంది..!

January 14, 2012

దైవ ప్రతినిధులే మన పండుగలు..!?

God is one
భక్తి
జ్ఞానాలే 

తరిగిపోని భాగ్యాలు, 


దైవ

ప్రతినిధులే

మన పండుగలు..! 

January 12, 2012

చట్టాల్ని తప్పించడం! చుట్టాల్ని మెప్పించడం.!

మా దేశంలో 

అధికారమంటే 
ఏమిటో  తెలుసా ..?

ఆ-కారుల్ని ఒప్పించడం!

చట్టాల్నితప్పించడం .!
చుట్టాల్ని మెప్పించడం..!

January 11, 2012

చీకట్లో అసలు దొరకదు.!

ఆత్మలో 
లేని ఆనందం 
జన్మలో 
వెతికినా దొరకదు..

వెలుగులో 
లేని సౌందర్యం 
చీకట్లో  
అసలు దొరకదు...!