December 20, 2011

స్వార్థమే ప్రేమయితే నాకేందు కది..?

మనసుతో చెబుతున్న 
ప్రేమంటే 
ఇదేనా ?


నన్ను నేను ప్రేమించిన  వాణ్ణి
ఇంకెవర్ని ప్రేమిస్తాను ?


స్వార్థమే  ప్రేమయితే
నాకేందు కది..? 

December 18, 2011

వొక స్త్రీ కారణం కావటం అనివార్యం..!

వ్యక్తులలోని  మలుపులకు కుడా ..!  
చరిత్రలో


ప్రతి మలుపుకూ  
ప్రత్యక్షంగానో -  పరోక్షంగానో  


వొక స్త్రీ  
కారణం కావటం అనివార్యం..! 

December 14, 2011

అందాలన్నీ కీర్తించే ప్రియుడ్ని నమ్మొద్దు.. !

అందాలన్నీ 
కీర్తించే 
ప్రియుడ్ని నమ్మొద్దు.. 


అంతస్తుల్ని 
ఆర్తించే 
ప్రియురాల్ని వోమ్మొద్దు..! 

గమనిస్తూనే ఉంటాను ..!

ఈ జీవితం 
ఓ  సమరం 
-
పోరాడుతూనే ఉంటాను ..


గమ్యం చేరేదాక 
గమనిస్తూనే ఉంటాను ..!  

December 1, 2011

వాణ్ణి నిలదీయాల్సిందే - ఎదిరించాల్సిందే...!?

లక్ష్య సాధనలో
ఎవడైతేనేం 
మాట తప్పినవాడు
బాట  తప్పినవాడు
వాణ్ణి నిలదీయాల్సిందే..


ఎవడైతేనేం
దోచుకునేవాడు 
దాచుకునేవాడు
వాణ్ణి  ఎదిరించాల్సిందే...!