September 30, 2011

ఎవరూ నీకు తోడు రారు.!

నీకు 
నీమీద 
నమ్మకం లేదా ? 

ముందుకు 
అడుగు వేయకు 
ఎవరూ  నీకు తోడు రారు ...!

నీవు పరిచయం అయ్యేదాకా నేనొక మనిషిని..!

నీవు పరిచయం 
అయ్యేదాకా 
నేనొక మనిషిని..

ఇప్పుడు
మనుషుల్నే
మరిచిపోయాను..!

September 29, 2011

ఓదార్పు..!


స్నేహం 
ఓదారుస్తుంది....!


 ప్రేమ
ఓదార్పు

కోరుకుంటుంది....!

September 28, 2011

రాజకీయ లక్షణాలు వచ్చినట్టే.. బావి నాయకుడు నువ్వే...!

నమస్తే - నమస్తే
కలిమి బలపడి - చెలిమి కొరవడి  

తిన్నది జీర్ణం కాకుంటే 
విన్నది  అర్థం కాకుంటే

ఎమంటావ్.?

రాజకీయ లక్షణాలు  వచ్చినట్టే..
బావి నాయకుడు నువ్వే...!


పకృతికి పరిపూర్ణ తృప్తి ..!

మబ్బులు తళతళ మెరిసినపుడే 

చెట్లు కిలకిలరవళుల్లో 
మురిసినపుడే 

కొండలు సెలయేర్లు స్పర్శ తో 
మైమరిచినపుడే 
పకృతికి పరిపూర్ణ తృప్తి ..!

September 27, 2011

ఇల్లాలి పెదవికి... చప్రాసి పదవికి... ??

కీప్ ఇన్ టచ్
ప్రియురాలి/ఇల్లాలి పెదవికి
చప్రాసి పదవికి
ఈనాడు చేయాలి  పైరవి .!

పైన రవి  
క్రింద భువి  
మధ్యనున్నది ఈ పైరవి.......!


అవ్వ కావాలా.. బువ్వ కావాలా..?


అవ్వ కావాలా..

బువ్వ కావాలా..?


బువ్వ పెట్టే  

అవ్వ కావాలి....!

September 26, 2011

విడిపోతే తమ వునికి యెక్కడని తెలుసుకోలేక ఆరాటం..!

కడలి నుండి 
విడి పోవాలని 
పడిలేచే  అలలు  పోరాటం... 

విడిపోతే
తమ వునికి  యెక్కడని 
తెలుసు కోలేక ఆరాటం...!

September 25, 2011

ఆత్మ ఉన్నవాళ్ళు చేసేవి ఆత్మహత్యలు ...!

ఆత్మ 
లేనివాళ్ళు  
చేసేవి
హత్యలు...

ఆత్మ 
ఉన్నవాళ్ళు  
చేసేవి
ఆత్మహత్యలు ...!


September 24, 2011

దేవుడి మెడలో - కోమలి జడలో : పువ్వులు ;

ఈ  పువ్వులు

భక్తుడి గుడి
దేవుడి మెడలోనైన ..!


కాముడి బడి 

కోమలి జడలోనైన....!

అమ్మ నాన్న ను కొన్నది ....! నన్న ను కన్నది ....!

అమ్మ

నాన్న ను  కొన్నది ....!

నన్న ను    కన్నది ....! 

September 23, 2011

మనిషికి దేవుడు వేసిన శిక్షలు..!

నిద్రపోతున్న

వాడికి  కలలు / నల్లులు... 


మేలుకున్న 

వాడికి  కోరికలు / పిల్లలు...!

September 22, 2011

ఎట్లా బతుకుతారయ్య ? సామాన్యులారా.!


పనికి రానిది 
వదిలేసే  బలం  లేదు..

గుండెల్లో 
చైతన్యం  పట్టే  స్థలం  లేదు ..!

September 21, 2011

ప్రేమ వేటాడుతున్నది! ప్రేయసి వెంటాడుతున్నది..!

ప్రేమ 
న్యాపకం  వేటాడుతున్నది....!

ప్రేయసి
జ్ఞాపకం  వెంటాడుతున్నది ....!

September 18, 2011

నీవు నీమీద నమ్మకమేప్పుడు కోల్పోతూ వస్తావో..!

నీవు
నీమీద నమ్మకమేప్పుడు
కోల్పో
తూ వస్తావో ..

ప్పుడే
నీకు 
దేవుని మీద 
విశ్వాశమప్పుడే పెరుగుతూ వస్తుంది...!

September 16, 2011

ఏడ్చినక కన్నేరుకి విలువుందా.. !

 
ఏడ్చినక
కన్నేరుకి  విలువుందా..

ఏడువనిదే
ఈ ప్రేమలో  గెలుపుందా ..! 

September 14, 2011

ఈ టెక్కు చూస్తే హైటెక్ జాబ్ అనిపిస్తుంది ....!

ఈ టెక్కు చూస్తే  
హైటెక్ జాబ్ అనిపిస్తుంది ....!


నీ డ్రెస్ చూస్తే
అడ్రెస్స్ కనిపిస్తుంది....!

September 6, 2011

కష్టం నాకు ఇష్టం.!


కష్టం 
నాకు ఇష్టం.... 


కలిసివస్తావా
నీవు  నాకు ఇష్టం...!